మహాత్మా గాంధీ ఎక్కువగా మేకపాలు తాగేవారు. వేరుశనగలను ఇష్టంగా తినేవారు. వాటిని తినమని అందరినీ ప్రోత్సహించేవారు. ఇ
ందుకు కారణం.. మేకలు గడ్డి తినడం మూలంగా, గడ్డి
లోని పోషకాలన్నీ మేక పాలలోకి చేరతాయి. స్వాతంత్రానికి పూర్వం గేదె పాలను తాగే సౌలభ్యం, పోషకాలతో నిండిన పప్పుధాన్యాలు తినగలిగే స్థోమత పేదలకు ఉండేది కాదు. కాబట్టే వాటికి ప్రత్యామ్నాయంగా సమానమైన పోషక విలువలున్న చవకైన ఆహారాన్ని మహాత్ముడు సేవించేవారు.