ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ నియమించింది. 1974 జూలై 19న ఢిల్లీలో జన్మించిన ఆమె 1996-1997లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) అధ్యక్షురాలిగా ఎన్నికతో రాజకీయ ప్రవేశం చేశారు. 2007లో ఉత్తరి పితంపుర కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి బందన కుమారిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయి, ఏకంగా సీఎం కాబోతున్నారు.