2023లో ఇదే అత్యుత్తమం

1549చూసినవారు
2023లో ఇదే అత్యుత్తమం
వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్గనిస్తాన్‌పై ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం ఇప్పటికీ మరిచిపోలేం. మ్యాక్సీ (201) సాధించిన డబుల్ సెంచరీ 2023 గ్రేటెస్ట్ నాక్ అని తాజాగా విజ్డెన్ ప్రకటించింది. మ్యాచ్ చేజారుతుందనుకున్న వేళ మ్యాక్సీ 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో అజేయ ద్విశతకం బాది జట్టుకు కీలక విజయం అందించాడు. ఆసీస్ 49/5తో పీకల్లోతు కష్టాల్లో ఉండగా, ఓ పక్క గాయంతోనే మ్యాక్సీ ఈ నాక్ ఆడాడు.

సంబంధిత పోస్ట్