బెండ సాగుకు సరైన సమయం ఇదే

68చూసినవారు
బెండ సాగుకు సరైన సమయం ఇదే
రైతులు బెండ సాగు చేసేందుకు జూన్‌, జూలై నెలలు అనుకూలం. రెండో పంటగా జనవరి, ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. ఎకరానికి 3-4 కిలోల విత్తనాలు అవసరం. బెండలో పర్భిని క్రాంతి, అర్కా అనామిక, అర్కా అభయ వంటి రకాలు మేలైనవి. ముందుగా నేలను 4-5 సార్లు బాగా దున్నుకొని 60 సెం.మీ. ఎడంతో బోదెలు ఏర్పాటు చేసి వాటిమీద 20-30 సెం.మీ. దూరంలో విత్తనాలను విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి తిరిగి 4 రోజుల తర్వాత రెండో తడి అందించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్