టీమ్ ఇండియాను గెలిపించిన వికెట్ ఇది

66చూసినవారు
T20 WC ఫైనల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య దుమ్ములేపారు. క్లాసెన్(51) భారీ షాట్లతో మ్యాచును భారత్ చేతుల్లోంచి లాగేసుకుంటున్న సమయంలో పాండ్యా అతడిని ఔట్ చేశారు. 16 ఓవర్లకు సాతాఫ్రికా స్కోర్ 151/4గా ఉన్నప్పుడు పాండ్య ఆఫ్ స్టంప్ కు దూరంగా వేసిన బంతిని క్లాసెన్ షాట్ కొట్టాలనుకున్నారు. కానీ బంతి బ్యాట్ ఎడ్కు తాకి కీపర్ పంత్ చేతుల్లో పడింది. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్