ఎంపిక చేసిన దేశాల్లో ఆమోదం పొందిన కొన్ని రకాల ఔషధాలను భారత్‌లో వినియోగానికి ఔషధ పరీక్షల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఐరోపా సంఘం, అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడాల్లో ఆమోదం పొందిన వాటికి ఇక్కడ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. చికిత్సలకు త్వరితగతిన ఔషధాల లభ్యతకు ఈ వెసులుబాటు కల్పించింది.