హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి! (వీడియో)

75చూసినవారు
గుజరాత్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోర్‌బందర్‌లోని కోస్ట్‌గార్డ్ ఎయిర్‌పోర్ట్‌లో హెలికాప్టర్ కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, మూడు నెలల క్రితం కూడా పోర్‌బందర్‌లోని కోస్ట్‌గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది.

సంబంధిత పోస్ట్