తిరుపతి లడ్డు వివాదం.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

55చూసినవారు
తిరుపతి లడ్డు వివాదం.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారి ఆలయ లడ్డు వివాదం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. 'చంద్రబాబు నాయుడు విజనరి లీడర్. అలాంటి వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో అర్ధం కావడం లేదు. ఏదయినా జరిగితే విచారణ చేయండని మాజీ సీఎం జగన్ అంటున్నారు. దేశ, విదేశాల్లో ఉన్న భక్తులు ఇపుడు లడ్డు తినాలా.. వద్దా అనే ఆందోళనలో ఉన్నారు. శ్రీవారి దర్శనం తర్వాత లడ్డు ప్రసాదం తింటేనే భక్తులకి తృప్తి.. ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్