'సంపూర్ణ మద్యపాన నిషేధం.. నువ్వు నొక్కని బటన్' అంటూ ఏపీలోని మద్యం దుకాణాలపై
జనసేన ట్వీట్ చేసింది. రాష్ట్రంలో మత్తు బానిసల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని.. కల్తీ మద్యంతో పాటు ఏపీని మత్తు పదార్థాలకు అడ్డాగా మార్చేశారని పేర్కొంది. అదేంటని ప్రశ్నిస్తే.. కల్తీ మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు వాడుతున్నామంటున్నారు. అమ్మ ఒడి ఇవ్వడానికి నాన్నల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా?' అంటూ ప్రశ్నించింది.