పొగాకుతో ప్రాణాలకు హానికరం

85చూసినవారు
పొగాకుతో ప్రాణాలకు హానికరం
పొగాకు 14 రకాల క్యాన్సర్లకు కారణం అవుతోంది. పొగాకు పొగలో కనీసం 80 రకాల క్యాన్సర్ కారకాలు (కార్సినోజెనిక్ ఏజెంట్లు) ఉంటాయి. పొగను పీల్చినప్పుడు రసాయనాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి, రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరమంతా రవాణా అవుతాయి . అందుకే ధూమపానం లేదా పొగాకు నమలడంతో ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌లు మాత్రమే కాకుండా అనేక ఇతర క్యాన్సర్‌లు కూడా వస్తాయి. ప్రస్తుతం పొగాకు వాడకం వల్ల దాదాపు 22% క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి .

సంబంధిత పోస్ట్