ఇవాళ భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం (Video)

51చూసినవారు
భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగుపెట్టింది. సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు. నాటి నుంచి భారత్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ఇవాళ ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అలాగే తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీలో సీఎం చంద్రబాబు జెండా ఎగురవేస్తారు.