గర్భ నిరోధక మాత్రలపై అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వాటిపై అవగాహన కల్పించడానికి ఏటా సెప్టెంబర్ 26న ‘ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు. 2007 సెప్టెంబర్ 26న నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు కావాలనుకునే జంటకు ఓ ప్రణాళిక ఉంటుంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా వచ్చే గర్భధారణను నివారించడానికి గర్భనిరోధకాలు ఉపయోగపడతాయి.
గర్భనిరోధకాలు వాడటం వల్ల తల్లీబిడ్డల మరణాలను 40% తగ్గించవచ్చు.