తెలంగాణలో చలి తీవ్రతపై తెలంగాణ వెథర్ మ్యాన్ 'X' వేదికగా కీలక అప్‌డేట్ ఇచ్చింది. జనవరి నెలలో బుధవారం రాత్రి అత్యంత చలిగా ఉంటుందని తెలిపింది. అలాగే గురువారం ఉదయం ఉత్తర, పశ్చిమ తెలంగాణలో 5-7°C ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలలో గురువారం ఉదయం 7-9°C ఉష్ణోగ్రతతో అత్యంత చలిగా ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. చలి పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.