రాయ్‌పూర్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

78చూసినవారు
రాయ్‌పూర్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు
సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే 2024-25 సంవత్సరానికి రాయ్‌పూర్‌ డివిజన్‌, వ్యాగన్‌ రిపేర్‌ షాప్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ఐటిఐ సంబంధిత విభాగాల్లో 1113 ఖాళీలకు దరఖాస్తు కోరింది. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌ల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. మెట్రిక్యులేషన్‌, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: 1 మే 2024.

సంబంధిత పోస్ట్