ట్రాన్స్ జెండర్ హత్య.. ఆధిపత్య పోరే కారణం

83చూసినవారు
ట్రాన్స్ జెండర్ హత్య.. ఆధిపత్య పోరే కారణం
AP: నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ట్రాన్స్ జెండర్ హాసిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. ట్రాన్స్ జెండర్ల నాయకులు హాసిని, అలేఖ్యల మధ్య ఆధిపత్యపోరే ఈ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. హత్య కేసులో 15 మంది ప్రమేయం ఉందని, వీరిలో 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ నెల 26న హాసిని దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్