AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు తప్పినట్లేనని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మూడు రోజుల పాటు మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.