దక్షిణ కొరియా ప్రథమ మహిళపై విచారణ

52చూసినవారు
దక్షిణ కొరియా ప్రథమ మహిళపై విచారణ
దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ కియోన్ ఒక పాస్టర్ నుంచి ఖరీదైన బ్యాగ్‌ను కానుకగా తీసుకొన్న విషయం వివాదాస్పదం కావడంతో విచారణ మొదలైంది. ఆమెను నిన్న దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయని ప్రాసిక్యూషన్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. కిమ్ స్వీకరించిన బ్యాగ్ విలువ 2,200 డాలర్లు. కొరియా చట్టాల ప్రకారం దేశ ప్రథమ మహిళలు 750 డాలర్ల కంటే అధిక విలువైన బహుమతులను స్వీకరించడం చట్ట విరుద్ధం.

సంబంధిత పోస్ట్