టిక్‌టాక్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

69చూసినవారు
టిక్‌టాక్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
టిక్‌టాక్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధం విధించే అవకాశాలపై ఓ మీడియాతో మాట్లాడారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. టిక్‌టాక్‌ను దేశంలో నిషేధించబోనని ట్రంప్‌ స్పష్టంచేశారు. సోషల్ మీడియాపై చర్యలకు సంబంధించిన బిల్లును ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించగా.. ట్రంప్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్