రామోజీరావు తెలుగు జాతి వెలుగు: చంద్రబాబు

75చూసినవారు
రామోజీరావు తెలుగు జాతి వెలుగు: చంద్రబాబు
రామోజీరావు మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీ అస్తమయం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, యావత్‌ దేశానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు, గ్రూపు సంస్థల ఉద్యోగులకు సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీరావు తెలుగు జాతి వెలుగు. తెలుగు ప్రజల ఆస్తి. ఆయన వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ.

సంబంధిత పోస్ట్