జగన్ నివాసంలో విజయమ్మ.. రాజీ కోస‌మేనా..?

60చూసినవారు
జగన్ నివాసంలో విజయమ్మ.. రాజీ కోస‌మేనా..?
ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. వైసీపీ ఓటమి తరువాత కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ సమయంలో విజయమ్మ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చినట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ఓటమి తరువాత జగన్ వద్దకు విజయమ్మ రావటం చర్చకు కారణమైంది. ప్రధానంగా కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులు..తన ఇద్దరు బిడ్డల మధ్య పెరిగిన గ్యాప్ పైన విజయమ్మ ఆవేదనతో ఉన్నట్లుగా సమాచారం. దీంతో..రాజీ ప్రయత్నాల దిశగా విజయమ్మ అడుగులు వేస్తున్నారనేది పార్టీ నేతలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్