ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో తాలిబన్ శరణార్థుల మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ మృతి చెందారు. మంత్రిత్వ శాఖ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ దాడిలో హక్కానీ సహా ఆయనకు సెక్యురిటీగా ఉన్న నలుగురు వ్యక్తులు సైతం ప్రాణాలు కోల్పోయారు. హక్కానీ మరణాన్ని ఆయన మేనల్లుడు అనాస్ హక్కానీ ధ్రువీకరించారు. ‘మేము చాలా ధైర్యమైన ముజాహిద్‌ను కోల్పోయాం’ అని పేర్కొన్నారు.