మ‌రోసారి 'బేబీ సిట్ట‌ర్'గా మారిన రిష‌భ్ పంత్‌ (వీడియో)

72చూసినవారు
టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రిష‌భ్ పంత్ మ‌రోసారి బేబీ సిట్ట‌ర్‌గా మారాడు. అడిలైడ్‌లో ఓ షాపింగ్ మాల్ వ‌ద్ద చిన్నారిని ఎత్తుకుని ఆడించాడు. ఓ అభిమాని కూతురు అయిన ఆ పాప‌ను ఎత్తుకుని పంత్‌ లాలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా, 2018/19 బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్‌లోనూ అప్ప‌టి ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ పిల్ల‌ల‌ను పంత్ ఆడించిన విష‌యం తెలిసిందే.

సంబంధిత పోస్ట్