జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి సరికాదు: మంత్రి పొన్నం

66చూసినవారు
TG: జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రిపోర్టర్ రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్, వైద్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నాం అన్నారు. మోహన్ బాబు, మంచు మనోజ్ వ్యక్తిగత పంచాయతీలో జర్నలిస్టుపై దాడి సరికాదని అన్నారు. దాడి ఘటనపై విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్