AP: ఇంధన సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను జగన్ ప్రభుత్వం పీడించిందని టీడీపీ ఆరోపించింది. 'అధికారం నుంచి దిగిపోయే ముందు కూడా రూ.12,849 కోట్ల ఎఫ్‌పీసీసీఏ ఛార్జీల వసూలుకు అనుమతి తీసుకున్నారు. 2022లోనే రూ.8113.60 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల కోసం ఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపారు. చేసిందంతా చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు' అని టీడీపీ మండిపడింది.