మాది భయపడే ప్రభుత్వం కాదు: పవన్‌ కల్యాణ్‌

76చూసినవారు
మాది భయపడే ప్రభుత్వం కాదు: పవన్‌ కల్యాణ్‌
వైసీపీ నేత సుదర్శన్‌రెడ్డి దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ధైర్యం చెప్పారు. ‘తలుపులు మూసి ఎంపీడీవోపై దాడి చేయడం దారుణం. ముఠాలతో భయపెడితే.. మాది భయపడే ప్రభుత్వం కాదు. అభివృద్ధికి ఎవరు అడ్డొచ్చినా ఊరుకోం. దాడి చేసినవారు ఎక్కడున్నా లాక్కొచ్చి జైలుకు పంపిస్తాం’ అని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్