ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను తీసుకురానుంది. దీనికోసం సన్నాహాలు మొదలుపెట్టింది. ‘భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025’లో TVS తన ఫస్ట్ సీఎన్‌జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ‘Jupiter 125 CNG’ పేరుతో దీన్ని పరిచయం చేసింది. ఈ బండి టాప్ స్పీడ్ గంటకు 80.5 కిలోమీటర్లు అని, ఈ స్కూటర్‌లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుందని తెలిపింది.