కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. పుష్ప 2 చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ సినిమా థియేటర్‌లో అల్లు అర్జున్ అభిమానులు రచ్చ సృష్టించారు. పుష్ప మూవీలోని ఒక పాట వస్తుండగా ఏకంగా థియేటర్‌లో స్క్రీన్ ముందు నిలబడి, మంటలను వెలిగించి డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.