ఢిల్లీ మెట్రో గత కొన్ని నెలలుగా అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సీటు విషయంలో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మెట్రో కోచ్‌లో కొట్టుకున్నారు. ప్రయాణికులంతా వీరి ఫైట్ కు దూరంగా ఉండగా.. కొందరు మాత్రం వారిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు మాత్రం అసలు ఆగలేదు. ఒకరినొకరు విపరీతంగా అసభ్య పదజాలం వాడుతూ దూషించుకుంటూ.. కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.