TG: ఇందిరా మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలతో జిల్లాకు రెండేసి మెగావాట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాలో 64 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కో మహిళా సంఘానికి ఒక మెగావాట్ చొప్పున 64 సంఘాలతో 64 ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. ఒకట్రెండు రోజుల్లో వర్క్ ఆర్డర్లు ఇచ్చి, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి ఈ యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.