తీవ్ర విషాదం.. ఇద్దరు మహిళలు ఆత్మహత్య

21193చూసినవారు
తీవ్ర విషాదం.. ఇద్దరు మహిళలు ఆత్మహత్య
తెలంగాణలోని కుమురంభీం అసిఫాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సిర్పూర్‌. టి మండలం బెస్తవాడలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలతో నిన్న రమ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే రమ మృతికి సరిత కారణమని బంధువుల ఆరోపించడంతో మనస్తాపంతో సరిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్