రైతులకు ఎంతో ప్రీతికరమైన పండుగ.. ఉగాది

1880చూసినవారు
రైతులకు ఎంతో ప్రీతికరమైన పండుగ.. ఉగాది
ప్రస్తుత సమాజంలో పండుగల ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలియడం లేదు. కానీ అసలైన కొత్త సంవత్సరం అంటే ఉగాది. భారతీయ సాంప్రదాయం ప్రకారం శుక్ల పాడ్యమి రోజున సృష్టి నిర్మాణం జరిగిందని పూర్వీకులు చెబుతుంటారు. అయితే అన్నదాతలు ఉగాది రోజున.. పొలం వద్ద నూతన పనులు ప్రారంభిస్తారు. దుక్కి దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. రైతులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఈ పండుగను ప్రీతికరంగా భావిస్తారు.

సంబంధిత పోస్ట్