డొనెట్స్క్‌పై ఉక్రెయిన్ దాడి.. 16 మంది మృతి

68చూసినవారు
డొనెట్స్క్‌పై ఉక్రెయిన్ దాడి.. 16 మంది మృతి
రష్యా అధీనంలోని డొనెట్స్క్‌పై ఉక్రెయిన్ సైన్యం ఆదివారం దాడి చేసింది. ఈ దాడిలో 16 మంది పౌరులు మరణించారని రష్యా మద్దతుగల వేర్పాటువాదులు తెలిపారు. ఉక్రెయిన్ తోచ్కా క్షిపణి ప్రయోగించిందని, అది నగరం మధ్యలోని నివాస ప్రాంతాల్లో పడిందని వారు వెల్లడించారు. దీంతో 16 మంది చనిపోయారని, 23 మందికిపైగా పౌరులు గాయపడ్డారని పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్