రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ దాడి (వీడియో)

75చూసినవారు
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ దాడి చేసింది. ఉక్రెయిన్ సైన్యం జరిపిన ఈ దాడిలో నౌక మునిగిపోయిందని ఉక్రెయిన్ నేవీ ప్రతినిధి డిమిత్రో ప్లెటెన్‌చుక్ వెల్లడించారు. రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, డ్రోన్లతో దాడి చేసినట్టు మంగళవారం వివరించారు. ఈ క్రమంలో 65 మిలియన్ డాలర్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్