ఒకే రోజు రెండు రష్యా నౌకలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్

65చూసినవారు
ఒకే రోజు రెండు రష్యా నౌకలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్దంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్లసముద్రంలోని రెండు నౌకలను ఉక్రెయిన్ దళాలు ఒకే రోజు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ విభాగం ప్రకటించింది. యుద్దం మొదలైన నాటి నుంచి దాదాపు 20 రష్యా యుద్ధ నౌకలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. దీంతో ఇక్కడ ఉన్న బ్లాక్‌సీ దళంలోని మూడోవంతు నౌకలను ముంచేసినట్లైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్