AP: ఏలూరు జిల్లాలోని కామవరపుకోట (M) వల్లంపట్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. యువకుల వేధింపులు తాళలేకే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. యువతి మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.