ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బంగ్లాతో భారత్ 41 వన్డేలు ఆడగా.. 32 మ్యాచ్‌ల్లో గెలిచి, 8 ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. భారత్ జట్టులో రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయాస్, హార్దిక్, రాహుల్, అక్షర్, జడేజా, కుల్‌దీప్, షమీ, అర్ష్‌దీప్ ఉన్నారు.