మీరు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చే ముందు యూట్యూబ్‌లో కొన్ని సెట్టింగ్‌లను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి డర్టీ వీడియోలు ప్లే అయ్యే ఛాన్స్ ఉంది. దానికోసం యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి.. ప్రొఫైల్‌కి వెళ్లాక సెట్టింగ్ ఓపెన్ చేయాలి. అక్కడ జనరల్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే రిస్ట్రిక్టెడ్ మోడ్ అని కనిపిస్తుంది. దానిని ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత యూట్యూబ్‌లో డర్టీ వీడియోలు కనిపించవు.