మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విషాద సంఘటన జరిగింది. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. ఈ విషయం తెలిసి అతడి తల్లి గుండెపోటుతో మరణించింది. 33 ఏళ్ల మనీష్ రాజ్‌పుత్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా పరీక్షలు రాశాడు. ఏ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కుమారుడి మరణవార్త తెలిసి అతడి తల్లి రాధా గుండెపోటుతో కుప్పకూలి చనిపోయింది.