కాకినాడలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు హైవేపై ఓ వోల్వో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.