విదేశాల్లో ఉన్న అఫ్గానిస్థాన్ దౌత్య కార్యాలయాలతో తమకు సంబంధం లేదని, అఫ్రాఫ్ ఘనీ సర్కారు జారీచేసిన వీసాలు, పాస్‌పోర్టులు, ఇతర పత్రాలను పట్టించుకోబోమని తాలిబన్లు తేల్చిచెప్పారు. ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’ పేరుతో ఉన్న దౌత్య కార్యాలయాలను మాత్రమే ఆయాదేశాల్లోని అఫ్గాన్ ప్రజలు సంప్రదించాలని సూచించారు. అఫ్గాన్‌ను తాలిబన్లు 2021లో గుప్పిట్లోకి తీసుకున్నా ఇంతవరకు ఏ దేశమూ వారిని ప్రభుత్వ పాలకులుగా గుర్తించలేదు.