2017-18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రధాని మోడీ చర్యలతోనే ప్రస్తుతం 3.2 శాతానికి తగ్గిందని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. భవిష్యత్తులో నిరుద్యోగ రేటు 3% కన్నా దిగువకు వస్తుందని తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు. ఇదే సమయంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 38 నుంచి 44, వర్క్ పాపులేషన్ రేషియో 31 నుంచి 40 శాతానికి పెరిగాయి అని మంత్రి వివరించారు.