కలియుగ దైవం తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖలు దర్శించుకున్నారు. తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు, నిర్మాత నందమూరి రామకృష్ణలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. బావ నారా చంద్రబాబునాయుడు సీఎం అయితే, తిరుమల స్వామి వారిని కాలినడకన దర్శించుకుంటానని మెుక్కుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు.