మరో దేశంలో UPI సేవలు

56చూసినవారు
మరో దేశంలో UPI సేవలు
యూపీఐ తరహా రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థను పెరూలో తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూ, ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యూపీఐ సాంకేతికతను దక్షిణ అమెరికాలో ప్రవేశపెట్టబోతున్న తొలి దేశంగా పెరూ నిలుస్తుందని ఎన్ఐపీఎల్ తెలిపింది. ఆ దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్