త్వరలో ఊరూరా ఆరోగ్య పరీక్షలు!

57చూసినవారు
త్వరలో ఊరూరా ఆరోగ్య పరీక్షలు!
తెలంగాణలో ఊరూరా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. దీనికోసం మొబైల్ ల్యాబ్ లను సిద్ధం చేయనుంది. 26-70 ఏళ్ల వయసున్న వారికి అన్ని రకాల రక్త పరీక్షలు, క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనుంది. ఆరోగ్య సమస్యలున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనుంది. ఎన్ఎచ్ఎమ్ లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చనుంది.

సంబంధిత పోస్ట్