లైంగికదాడి కేసులో కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అక్కడ ఓ మైనర్ బాలుడిపై ఓ వృద్ధుడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇస్లామిక్ తరగతులకు వెళ్లిన బాలుడిపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. విచారించిన కోర్టు పలు ఐపీసీ సెక్షన్ల కింద వృద్ధుడిని దోషిగా తేల్చింది. దీంతో అతనికి మొత్తం 56 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అత్యధికంగా ఓ కేసులో 20 ఏళ్ల శిక్ష వేసింది.