మధ్యప్రాచ్యంలోకి యూఎస్ మిస్సైల్ సబ్‌మెరైన్

77చూసినవారు
మధ్యప్రాచ్యంలోకి యూఎస్ మిస్సైల్ సబ్‌మెరైన్
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)లోకి మిస్సైల్ సబ్‌మెరైన్ తరలించాలని యూఎస్ రక్షణశాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. ఇప్పటికే మధ్యధరా సముద్రంలో యూఎస్ఎస్ జార్జియా న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్ లంగరు వేసి ఉంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే టెల్ అవీవ్‌కు మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం ఇటీవల స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్