అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా

78చూసినవారు
అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా
అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రంప్ పై కాల్పుల ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాల్పుల ఘటనలో సీక్రెట్ సర్వీస్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ను రక్షించడంలో తన ఏజెన్సీ విఫలమైందని ఆమె ఇప్పటికే అంగీకరించింది. కాల్పుల ఘటన తర్వాత ఒత్తిడి పెరగడంతో ఆమె రాజీనామా చేసినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్