పంజాబ్‌లో భగవంత్‌మాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 52 మంది పోలీసులపై వేటు పడింది. అంతేకాదు.. జిల్లా కమిషనర్‌ను కూడా పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. లంచాలు తీసుకునే, దురుసుగా ప్రవర్తించే పోలీసులకు వ్యతిరేకంగా భగవంత్‌మాన్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు.