ఈ వీడియోలో ఓ వ్యక్తి తన భార్య, కొడుకుతో కలిసి సైకిల్‌పై వెళుతున్నాడు. బ్రిడ్జిపై సైకిల్ తొక్కడానికి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆ వ్యక్తి కొడుకు అయిన చిన్న కుర్రాడు తన తండ్రికి సహాయం చేయడానికి కిందకు దిగి.. సైకిల్‌ను వెనుక నుంచి నెడుతున్నాడు. దీంతో ఆ తండ్రి సైకిల్‌ను సులభంగా ముందుకు తొక్కగలిగాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరలవుతుంది.