తెలుగుతేజం అరుదైన రికార్డ్

1558చూసినవారు
తెలుగుతేజం అరుదైన రికార్డ్
పంజాబ్‌తో మ్యాచ్‌లో రాణించిన సన్‌రైజర్స్ యువ క్రికెటర్ నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 50 పరుగులు, ఓ వికెట్, ఓ క్యాచ్ అందుకున్న తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గత 16 సీజన్లలో ఈ ఘనతను ఏ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ సాధించలేదు. ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్లను అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. ఇక ఈ రికార్డును వైజాగ్‌కు చెందిన 20 ఏళ్ల తెలుగు కుర్రాడు ఒక్కడే సాధించాడు.

సంబంధిత పోస్ట్